తెలంగాణ విషయాల్లో జోక్యం చేసుకుంటే పళ్లు రాలగొడతాం అని సిఎం ఎపి ఏజెంట్.. అందుకే ఆంధ్రా వాళ్ల విగ్రహాలు పెడుతున్నారని మండిపడ్డారు.. అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాలు అన్నీ కూలగొడతామని సూచించారు. జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఆంధ్రావాళ్లంతా తమవారేనని, ఆంధ్రావాళ్లను 12 ఏళ్లు కడుపున పెట్టి కాపాడుకున్నామని, ఇకపై కూడా హైదరాబాద్ లోని ఆంధ్రావాళ్లను కాపాడుకుంటామని తెలియజేశారు. ఇక్కడకు రావచ్చు..పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, షూటింగ్ లు చేసుకుని పోవచ్చునని, ఎపి నేతలు తమ సచివాలయంలో గరిటె తిప్పుతామంటే కుదరదు అని కవిత హెచ్చరించారు.