తెలంగాణ విస్తరిస్తామని ఎపి మంత్రి లోకేష్ అంటున్నారని, ఇదేమీ సామ్రాజ్యం కాదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తెలిపారు. తెలంగాణలో నవనిర్మాణం పేరుతో డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సభ పెడతారట అని అన్నారు. కుట్రలతో తెలంగాణపై ఏది పడితే అది మాట్లాడుతున్నారని, 13 ఏళ్లయినా ఎపిలో కనీసం రాజధాని కట్టుకోలేదని విమర్శించారు.వర్షాకాలంలో సచివాలయంలోకి నీరు రాకుండా పవన్, లోకేష్ చూసుకోవాలని, ఎపి, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెడతామంటే ఊరుకోనేది లేదని కవిత హెచ్చరించారు.