కాకినాడ జిల్లా చామవరంలో సిఎం ‘పేదల సేవలో ’ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒక్కో కుటుంబానికి 3,4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అసెంబ్లీలో మహిళలకు 33శాతం సీట్లు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా చేస్తామని తెలియజేశారు. ఏ సమస్యకైనా ఆన్ లైన్ లోనే పరిష్కారం చూపుతున్నామని, పి4 కార్యక్రమం కింద పేదలను ఆదుకుంటున్నామని చెప్పారు. పింఛన్ల ద్వారా 62.34 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నామని, రాష్ట్రాభివృద్ధి కోసం డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, తాను కలిసి ఆలోచిస్తున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.