జనసేన అధినేత పవన్ కల్యాణ్ జూన్ 2వ తేదీన తెలంగాణలో నవ నిర్మాణ సభను ఏర్పాటు చేయడంపై మంత్రి పొన్నం మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సినిమా నటుడు అని, పవన్ కల్యాణ్‌కు పైసలిస్తే ఎలాంటి నటన అయినా చేస్తాడని.. ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడని విమర్శించారు. ఇప్పుడు బీజేపీ స్క్రిప్ట్‌కు అనుగుణంగానే నటిస్తున్నాడని, బీజేపీ ఇచ్చే రెమ్యూనరేషన్ కోసం తెలంగాణకు రావడం లేదని.. నువ్వు నమ్మిన దేవుడు కొండగట్టు అంజన్నపై ప్రమాణం చేసి చెప్పగలవా అని పవన్‌కల్యాణ్‌కు సవాలు విసిరారు.