ఈశాన్య మయన్మార్ లో ఆదివారం మధ్యాహ్నం ఓ భవనంలో గనుల తవ్వకాల కోసం నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోవడంతో 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంలో మరో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ పేలుడు తీవ్రత వల్ల దాదాపు 100కు పైగా నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గనులు, క్వారీ తవ్వకాల కోసం ఈ భవనంలో ‘జెలిగ్నైట్’ అనే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిందని లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది.