BRSకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మోటార్లకు మీటర్లు పెడితే, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేస్తే.. తాము ఎన్నికల్లో పోటీ చేయబోమన్నారు. తాము ఉచిత విద్యుత్ కొనసాగిస్తే.. బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉంటుందా? అని సవాల్ విసిరారు. రైతుల ముసుగులో కేసీఆర్ రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలోని భాజపా సర్కారు వడ్లు సరిగ్గా కొనుగోలు చేయడం లేదు. రాష్ట్రంలో 32 శాతం ధాన్యం మాత్రమే కొంటోంది. భాజపా నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి వాఖ్యానించారు