అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT)ల మధ్య ఈ చారిత్రాత్మక టైటిల్ పోరు జరగనుంది. మ్యాచ్ టిక్కెట్ల ధరలు కనీస ధర రూ.5,000 (బ్యాక్ స్టాండ్ టికెట్లు) ఉండగా.. గరిష్ట ధర రూ.2,20,000 (హాస్పిటాలిటీ యాక్సెస్, విలాసవంతమైన సీటింగ్, విందు సౌకర్యాలతో కూడిన ప్రీమియం టిక్కెట్లు) అమ్మకాలు జరుగుతున్నాయి. టిక్కెట్లను ‘డిస్ట్రిక్ట్’ యాప్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఒకే అకౌంట్/ఖాతా నుండి గరిష్టంగా 4 టిక్కెట్లను మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది.