అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్ భారత్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తన భర్త మైఖేల్ బౌలోస్, స్నేహితులతో కలిసి ఢిల్లీలోని ప్రపంచ ప్రసిద్ధ బీఏపీఎస్ స్వామినారాయణ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఆలయ నిర్వాహకులు టిఫానీ ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ పూలమాలలు ధరించి వారు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.