ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో విన్నర్స్ అయ్యి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది గుజరాత్ టైటాన్స్ జట్టు..భారీ టార్గెట్ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. టైటాన్స్ రన్ మెషిన్స్‌లా మారారు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు గిల్, సుదర్శన్ అద్భుత పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పి.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చెయ్యగా.. 215 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్.. సునాయాసంగా ఛేజింగ్ చెయ్యగలిగింది.