సైబర్ నేరాల అడ్డుకట్టకు జీరో ఎఫ్ఎస్ఐఆర్ విధానం అమల్లోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్యలపై సీఎం అధికారులతో శుక్రవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బాధితులు సైబర్ వార్ రూమ్ కు ఫోన్ చేసిన వెంటనే జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి.. బ్యాంకులను అప్రమత్తం చేయాలన్నారు. దీని ద్వారా గోల్డెన్ అవర్ టైంను వినియోగించుకుని అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ కాకుండా చూడాలని ఆయన ఆదేశించారు.

