పంజాబ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. పంజాబ్‌లో ఈ నెల 26న 102 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం పంజాబ్‌లో మొత్తం 1,977 వార్డులకు ఎన్నికలు జరగగా 1,735 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో 850 స్థానాలకుపైగా ఆప్ కైవసం చేసుకుంది.
మిగిలిన వాటిలో కాంగ్రెస్ 342, శిరోమణి అకాళీదర్ 165, బీజేపీ 131, ఇండిపెండెంట్లు 241 సీట్లు దక్కించుకున్నాయి.

