కర్ణాటక రాజకీయ పరిణామాల ప్రభావంతో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్లు ఒక్కసారిగా 20 శాతం లాభపడి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాల నేపథ్యంలో పెట్టుబడిదారులు భారీగా షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. డీకే శివకుమార్ కుటుంబానికి కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుటుంబంతో ఉన్న బంధం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.
వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేకు డీకే శివకుమార్ తన కుమార్తె ఐశ్వర్యను వివాహం చేయడం తెలిసిందే.