కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీకి వచ్చిన ఏపీసీసీ చీఫ్ షర్మిల రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు ఇద్దరి మధ్య మంత్రాంగం సాగింది. రాష్ట్ర రాజకీయాల పైన చర్చ జరిగింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని షర్మిల కోరినట్లు సమాచారం. షర్మిలకు రాజ్యసభ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం…ఆ దిశగా కసరత్తు చేస్తోంది. కర్ణాటక లేదా ఢిల్లీ కోటాలో షర్మిలకు రాజ్యసభ దక్కే అవకాశం ఉందని పార్టీ నేతల సమాచారం.