మాజీ మిస్ పుణె, నటి ట్విషా శర్మ అనుమానస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్విషా శర్మ ఆమె అత్త మాజీ జిల్లా న్యాయమూర్తి గిరిబాలా సింగ్ను భోపాల్లో సీబీఐ అరెస్టు చేసింది. గిరిబాలాసింగ్ను 8 గంటల పాటు ప్రశ్నించిన తరువాత సీబీఐ అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. ట్విషా శర్మకు మృతి చెందడానికి ముందు తన తల్లి, స్నేహితురాలికి ఆమె పలు సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. తాను వేధింపులకు గురవుతున్నానని వాటిల్లో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.