కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సీఎం సిద్ధరామయ్య
రాజీనామా చేస్తారని ఇప్పటికే వార్తలు రాగా.. కొత్త ముఖ్యమంత్రి మే 30న ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. కర్ణాటకలో సీఎం సిద్ధు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య సీఎం పీఠం కోసం ఎప్పటినుంచో పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఎవరి మనసూ నొప్పించకుండా ఈ నాయకత్వ మార్పు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కృషి చేస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.