సీబీఎస్ఈ 12వ తరగతిలో ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ మార్కింగ్ (ఓఎస్ఎం) పద్ధతిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జవాబుపత్రాల స్కానింగ్ కాపీల కోసం విద్యార్థుల నుంచి పెద్దఎత్తున అభ్యర్థనలు వస్తున్నాయి. పరీక్ష రాసిన ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకరు బోర్డుకు రిక్వెస్ట్ పంపడం గమనార్హం. ఈ ఏడాది దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి పరీక్షలు రాశారు. వీరిలో ఇప్పటివరకు 4,04,319 మంది విద్యార్థులు తమ జవాబు పత్రాల స్కానింగ్ కాపీలను అడిగినట్లు బోర్డు వెల్లడించింది.