మహానాడు అంటే కార్యకర్తల పండుగ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘వర్చువల్ వల్ల వాహనాల జోష్ తగ్గిందే కానీ.. మీలో జోష్ తగ్గలేదు. క్లస్టర్ల నుంచి లక్షలాది మంది పాల్గొన్నారు. మారింది మీటింగ్ విధానమే.. మహానాడు విధానాలు కాదు. మహానాడులో అన్ని అంశాలపై చర్చించుకుందాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది తెదేపానే’’ అని వెల్లడించారు.