హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS)లో మంగళవారం ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న గద్వాల డిపోకు చెందిన ఈ బస్సు నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు చెలరేగడంతో బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బస్సు ఇంజిన్ భాగం నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించడాన్ని గమనించిన డ్రైవర్, కండక్టర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనల నడుమ ఒకరినొకరు నెట్టుకుంటూ, ప్రాణాలు చేతబట్టుకుని బస్సు దిగి ప్లాట్‌ఫాంపైకి పరుగులు తీశారు.