సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థి వేదాంత్ శ్రీవాస్తవకు ఫిజిక్స్ సబ్జెక్టులో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. రీ ఇవాల్యుయేషన్లో సీబీఎస్ఈ అప్లోడ్ చేసిన ఫిజిక్స్ ఆన్సర్ షీట్ నాది కాదు అంటూ వేదాంత్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభించినప్పటికీ..ఆ కుటుంబ జాతీయతను ప్రశ్నిస్తూ.. ‘పాకిస్థానీయులు’ అంటూ క్రూరంగా ట్రోల్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఒత్తిడి పెరగడంతో సీబీఎస్ఈ బోర్డు తన తప్పును అధికారికంగా ఒప్పుకుని.. సదరు విద్యార్థికి సరైన మార్కుల పత్రాన్ని అందజేసింది.