అమెరికా వర్జీనియా లోని స్టోర్లో గుజరాత్ కు చెందిన భారతీయ మహిళ మేఘనా పటేల్ హత్యకు గురయ్యారు. మేఘనా పటేల్ తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. స్టోర్ లోపల దుండగుడు ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి,ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఓ వ్యక్తి కస్టమర్ తరహాలో దుకాణంలోకి ప్రవేశించి ట్రాక్సైట్, జాకెట్, గ్లోవ్స్, ఫేస్ మాస్క్ టోపీ ధరించి ఉన్న ఆ వ్యక్తి.. మేఘనా పటేల్ తో కొద్దిసేపు మాట్లాడిన సెకన్ల వ్యవధిలోనే ఆమెపై కాల్పులు జరిపాడు.