ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్టమంతా ఒకేలా ఎండలు కానీ, వర్షపాతం కానీ లేవు. ఇవాళ కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరులో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 48.1 డిగ్రీలు నమోదయ్యాయి. రేపు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45 – 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు, మరోవైపు ద్రోణి ప్రభావంతో పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.