అన్నీ పోగొట్టుకునేందుకు సిద్ధంగా ఉండి రాజకీయాల్లోకి వచ్చానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇదే విధంగా తనను విమర్శించే వాళ్లు రాగలరా అని ప్రశ్నించారు. కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఉద్దేశించి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే.. తామూ ఎదురుదాడి చేస్తామని హెచ్చరించారు. ‘‘మీరు ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పండి నేను సిద్ధం. ఛాయిస్ మీకే ఇస్తున్నా.. అంతేగానీ నన్ను రెచ్చగొట్టొద్దు. విశ్లేషించే వారిని ప్రశ్నిస్తే.. కులం కార్డును పట్టుకొస్తామంటే ఎలా?’’ అని ప్రశ్నించారు.