తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఒక బాలికపై జరిగిన అత్యాచార కేసు వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ (IPS) అధికారులపై సీఎం విజయ్ తక్షణమే సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులకు న్యాయం చేయాల్సిన స్థానంలో ఉండి, కేసు వివరాలు వెల్లడిస్తూ నవ్వడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని సోషల్ మీడియాలోనూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.