ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై జరుగుతున్న ట్రోలింగ్, పోలీసు కేసుల నమోదుపై నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ గళం విప్పారు. ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేయడం ఏ రకమైన రాజకీయ సంస్కృతి అని ఆయన నిలదీశారు. మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాం అనడం రాజకీయ గుండాయిజం కాదా?” అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేసీఆర్, జగన్, రేవంత్ రెడ్డి ఇలా అందరినీ నాగేశ్వర్ ప్రశ్నించినప్పుడు ఆయన నిజాయితీ గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు.