విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. అరవ శ్రీధర్ తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా శ్రీధర్ ప్రకటించారు. వరసగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే అరవ శ్రీధర్ రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది. తనపై వస్తున్న విమర్శలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విఫ్ కు రాజీనామా చేశారు. ఎంఎల్ఎగా కొనసాగుతున్నట్టు సమాచారం.