పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే ఇరాన్ పై మరోసారి దాడికి దిగేందుకు అమెరికా సన్నద్ధమవుతుందంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని పశ్చిమ ప్రాంతం వైపున ఉన్న గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ సిబ్బందికి నోటమ్ జారీచేసింది. ఈనెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.