ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ వెబ్‌సైట్‌ను ఇవాళ తొలగించినట్లు దాని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని, దీన్ని “నియంతృత్వ” చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ “నియంతృత్వ వైఖరిని” ఆయన ఎక్స్ వేదికగా ఆక్షేపించారు. 10 లక్షల మంది సభ్యులు వెబ్‌సైట్‌లో చేరారని, యువత అసంతృప్తితో కూడిన ఈ మీమ్-ఆధారిత సంచలనంపై చర్చను మరింత ముమ్మరం చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్, పార్టీ సోషల్ మీడియా పేజీలు హ్యాక్ అయ్యాయని దీప్కే ఆరోపించారు.