సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో రైతులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం లేదంటూ గజ్వేల్-తూప్రాన్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డుపై వరి ధాన్యం పోసి తగలబెట్టారు. ప్రభుత్వం వరి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంట కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేవారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు.