తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం యాదగిరిగుట్ట (యాదాద్రి) లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. క్షేత్ర పరిధిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన వైభవంగా భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సీఎం రేవంత్ రెడ్డి శాస్త్రోక్తంగా భూమి పూజలో పాల్గొన్నారు. భూదేవి పూజ, నవగ్రహ పూజలతో పాటు ప్రత్యేక మంత్రపుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా పండితులు ముఖ్యమంత్రికి రక్షాబంధనం (కంకణ ధారణ) చేసి ఆశీర్వచనాలు అందించారు.