కర్ణాటకలోని కలబురగి జిల్లా లాడ్లాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ క్రూజర్ వాహనం, ఎదురుగా వస్తున్న భారీ లారీని బలంగా ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణిస్తున్న సమయంలో క్రూజర్ వాహనం అదుపుతప్పి, లారీని ముఖాముఖి ఢీకొట్టడం వల్లనే ఈ విషాదం చోటుచేసుకుంది. లారీ వేగానికి క్రూజర్ ముందుభాగం పూర్తిగా ధ్వంసమై ఇనుప చుట్టలా మారిపోవడంతో, మృతదేహాలన్నీ వాహనంలోనే ఇరుక్కుపోయాయి. మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.