తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత అరెస్టయ్యారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్టీ కార్యకర్తలతో కలిసి సచివాలయం వద్ద ఆమె ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తోందని.. అన్నదాతలను అరిగోసలు పెడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యంతో పాటు జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అడ్డుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి.. ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.