జాషువా అనే వ్యక్తి ప్రస్తుతం అవనిగడ్డలోని ప్రభుత్వ కళాశాలలో లెక్చర్, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక యువతికి తనకు తెలిసిన రికమండేషన్లుతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అందుకోసం ఒక ఇంటికి పిలిచాడు. యువతితో కలిసి లెక్చరర్ జాషువా గదిలో ఉన్న సమయంలోనే అతని భార్య తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.
అనంతరం పోలీసులకు విషయం చేరవేసింది. దీంతో చుట్టుప్కల వారు గుమిగూడటంతో జరిగిందంతా వివరించి, లెక్చరర్ అని కూడా చూడకుండా దేహశుద్ధి చేసింది.