పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల వల్ల వచ్చే వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో లక్నో హైకోర్టుకు చెందిన 50 మందికి పైగా న్యాయమూర్తులు, న్యాయాధికారులు శుక్రవారం (మే 22, 2026) తమ లగ్జరీ కార్లను పక్కనబెట్టి, సైకిళ్లపై కోర్టుకు తరలివచ్చారు. లక్నో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్ ఈ ప్రత్యేక సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి మల్ఖాన్ సింగ్ నివాసం వద్ద కూడా పెద్ద సంఖ్యలో న్యాయాధికారులు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.