భారత సైన్యానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్న నెట్‌వర్క్‌ను పంజాబ్ పోలీసులు బట్టబయలు చేశారు. పఠాన్‌కోట్- జమ్ము జాతీయరహదారిపై నిఘా కెమెరాలు అమర్చి.. తద్వారా మిలిటరీ వాహనాల కదలికలను సేకరించి పాక్ చేరవేస్తున్నట్లుగా అనుమానించిన వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని పఠాన్‌కోట్‌కు చెందిన బల్జీత్ సింగ్‌గా గుర్తించారు.