చంద్రపూర్ జిల్లా సిందేవాహిలోని గంజేవాహి అడవి ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న 13 మంది మహిళలు అడవిలో టేకు ఆకులు కోయడానికి గుంపులుగా వెళ్లారు. ఇంతలో అక్కడ పెద్ద పులి మాటు వేసి ఉంది. వీరిపై గాండ్రించుకుంటూ దాడి చేసే సరికి అందరు భయంతో పరుగులు పెట్టారు. పులి పదే పదే దాడి చేయడంతో కొంత మంది పడిపోయారు. ఈ క్రమంలో నలుగురిపై దాడి చేసి పులి చంపేసింది. పులి నిర్విరామంగా దాడి చేయడంతో నలుగురు మహిళలు మరణించారని చెప్పారు.