ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు దేశ వ్యాప్తంగా 24 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో నాలుగు స్థానాలతోపాటు 10 రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న 20రాజ్యసభ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాజ్యసభ ఉప ఎన్నికలకు జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు జూన్ 8. జూన్ 18న ఎన్నికల పోలింగ్ జరగ్గా అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది.