తనపై తాను దాడి చేయించుకుని హాట్ టాపిక్‌గా మారిన పాస్టర్ అభినయ్ దర్శన్ పాతకథలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. గతంలో సినిమా రంగంలో అభినయ్ అనే పేరుతో సినిమాల్లో నటించి, వెండితెరపై మెరవాలని కలలు కన్నారు.ఆశించిన గుర్తింపు రాకపోవడంతో పాస్టర్ అవతారమెత్తాడు మొదటి భార్య ఉండగానే మరో వివాహం చేసుకోవడం, ఆపై ఆమెతోనూ గొడవలు పడి మూడో పెళ్లి కూడా చేసుకున్నారు. ఆయన ప్రసంగాల్లో ఉండే నాటకీయత, హావభావాలు అన్నీ సినిమా రంగానికి సంబంధించినవేనని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. తర్వాత అదే పద్దతిలో రాజకీయంపై కన్నేశారు.