దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప నాయకుడు దివంగత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని చెప్పుకొచ్చారు. తెలంగాణ సమాజం సోనియాగాంధీ కుటుంబానికి ఎంతో రుణపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

