టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు) పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా సామాజిక మాధ్యమాల దిగ్గజం ‘మెటా’ (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ) తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. రేపే (మే 20న) సంస్థలో పనిచేస్తున్న దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు యాజమాన్యం అన్ని చర్యలను పూర్తి చేసింది. ప్రస్తుతం మెటా సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 77,986 మంది ఉద్యోగులు ఉండగా.. అందులో దాదాపు 10 శాతం మందిపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడనుంది.