మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ద’ ట్రైలర్ యూట్యూబ్లో రికార్డుల మోత మోగిస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటలకి అన్ని భాషల్లో కలిపి ఏకంగా 101 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. యూట్యూబ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన మొట్టమొదటి తెలుగు ట్రైలర్ గా, యూట్యూబ్ మూవీస్ ట్రెండింగ్ చార్ట్ నంబర్ 1 స్థానంలో దూసుకుపోతుంది.

