భారత స్టాక్ మార్కెట్ బుధవారం భారీ ఒత్తిడిలో ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పడిపోయి పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేసింది. ఉదయం 9:20 గంటల సమయానికి సెన్సెక్స్ 531 పాయింట్లకు పైగా నష్టపోయి 74,668 స్థాయిలో ట్రేడవుతుండగా, నిఫ్టీ 169 పాయింట్లు తగ్గి 23,448 వద్ద కొనసాగింది.ఇక రూపాయి విలువ కూడా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే కొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఒక డాలర్ విలువ రూ.96.86కు చేరింది