గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ డ్రాగన్(Dragon) అఫీషియల్ గ్లింప్స్ రిలీజ్ అయి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను 2027 జూన్ 11గా అనౌన్స్ చేశారు. మధ్యలో అప్ డేట్స్ ఏమీ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. కానీ మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ మూవీ యూనిట్ అర్ధరాత్రి వేళ ఈ పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది.