ఉత్తర్ ప్రదేశ్‌లో న్యాయ విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూ యువ వాహిని మాజీ సభ్యుడు సుశీల్ ప్రజాపతి తొమ్మిది నెలల కిందట ఓ విద్యార్థినిపై అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. తొమ్మిది నెలలుగా సుశీల్ ప్రజాపతి జైలులో ఉన్నాడు.బెయిల్‌పై సుశీల్ విడుదల సందర్భంగా ఘజియాబాద్ జైలు వద్ద అతని మద్దతుదారులు తమ భుజాలపై సుశీల్‌ను ఎత్తుకుని రోడ్‌షో నిర్వహించారు. విజయోత్సవ ర్యాలీ చేపట్టి సుశీల్‌కి మద్దతుగా నినాదాలు చేస్తూ రోడ్లపై హంగామా సృష్టించారు.

