పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి ఓ 80 ఏళ్ల వృద్ధురాలి ఇంటిని అక్రమార్కులు కబ్జా చేసిన ఘోరం జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన ముస్సై గంగవ్వ (80) ఇంటి స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని జిల్లా కలెక్టర్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. పెన్షన్ ఇప్పిస్తామని నమ్మించి, తన పెద్ద కుమారుడు రాజేశంతో కుమ్మక్కై అధికార పార్టీ సర్పంచ్ భర్త గట్టు గంగారం 6 గుంటల ఇంటి స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని గంగవ్వ ఆవేదన వ్యక్తం చేశారు.