కిషన్ బాగ్ నివాసి అయిన బంగి దేబోరాకు తన భర్త మధ్య గత కొంతకాలంగా గృహ కలహాలు నడుస్తున్నాయి భర్తతో తీవ్రస్థాయిలో గొడవ తర్వాత తను పనిచేసే స్పా సెంటర్కు వెళ్లిపోయింది. భార్య వెనకాలే స్పా సెంటర్కు చేరుకున్న భర్త, తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగాడు, సిబ్బంది , కస్టమర్లు చూస్తుండగానే, ఆమెను విచక్షణ రహితంగా పొడిచి కిరాతకంగా చంపేశాడు. హత్య అనంతరం నిందితుడు రక్తపు మరకలతోనే అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.