పంజాబ్ లోని లూధియానాలో విషాద సంఘటన చోటుచేసుకుంది.కిడ్నాప్ కు గురైన 29ఏళ్ల గాయని యషిందర్ కౌర్ (‘ఇందర్ కౌర్’గా సుపరిచితురాలు) హత్యకు గురైంది. ముండియన్ కలన్ ప్రాంతానికి చెందిన యషిందర్ ను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన ఐదు రోజుల తర్వాత, మంగళవారం కుబా గ్రామం సమీపంలోని నీలోన్ కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. కెనడాలో నివసిస్తున్న ఆమె స్నేహితుడు సుఖ్వీందర్ సింగ్ అలియాస్ ‘సుఖా’, అతని తండ్రి ప్రీతమ్ సింగ్, స్నేహితుడు కరంజీత్ సింగ్‌లపై ఈ కేసు నమోదైంది.