ఇరాన్ వద్ద శుద్దీకరించిన యురేనియం నిల్వలు ఉన్న విషయం తెలిసిందే. భారీ మొత్తంలో ఇరాన్ వద్ద స్టాక్స్ ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. ఆ అణు నిల్వల కోసం అమెరికా దాడికి కూడా ప్లాన్ చేసింది. అయితే తమ వద్ద ఉన్న అణ్వాయుధ నిల్వలను రష్యాకు అప్పగించాలని ఇరాన్ భావిస్తున్నట్లు సౌదీ అరేబియాకు చెందిన మీడియా సంస్థ అల్ హదత్ తన కథనంలో పేర్కొన్నది. పాకిస్థాన్ ద్వారా శాంతి ప్రతిపాదన చేసిన ఇరాన్ తన అణు నిల్వల అంశాన్ని అమెరికాకు వెల్లడించినట్లు తెలుస్తోంది.