రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని కనకమామిడి దగ్గర ఉన్న వ్యాస ఫామ్‌హౌస్‌లో యాక్సిస్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సాయి అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఇక్కడ పుట్టినరోజు వేడుకలలో సాయి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. పూల్‌లో పడిపోవడాన్ని ఎవరూ గమనించలేదు.మరుసటి రోజు ఉదయం వాచ్‌మన్ పూల్‌లో సాయిని చూసి స్నేహితులకు సమాచారం అందించాడు. సాయి మరణంపై అతని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య, ఏడాది బాబు ఉన్నారు.