కేంద్రమంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు సాయి భగీరథ్‌కు మంచి బుద్ధి ఇవ్వాలని బీఆర్ఎస్ మహిళా నాయకులు ప్రార్థించారు. ఈ మేరకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బండి సంజయ్‌కు చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారు అంటే ఎంతో ఇష్టమని.. అందుకే ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తున్నామని మహిళా నాయకులు తెలిపారు. బండి సంజయ్‌కు మంచి బుద్ధి వచ్చి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరారు. బండి సంజయ్‌కు కేబినెట్‌లో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు.