భారత ప్రధాని నరేంద్ర మోదీ, స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీలో భారత్, స్వీడన్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యంగా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇందులో భాగంగానే రాబోయే ఐదేళ్ల కాలానికి దిక్సూచిగా నిలిచే “2026-30 ఇండియా-స్వీడన్ జాయింట్ యాక్షన్ ప్లాన్”ను ఇరు దేశాల అధినేతలు సంయుక్తంగా ఆవిష్కరించారు. రక్షణ, అంతరిక్ష పరిశోధనలు, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి భవిష్యత్తు రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఈ కార్యాచరణ ప్రణాళిక ఎంతో దోహదపడుతుందని ఉభయ పక్షాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.